Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి
రెండురోజులపాటు ఓయూలో పర్యటన
నవతెలంగాణ-ఓయూ
ఓయూ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఓయూలోని ఈ2, డీ, ఈ1, బీఈడీ తదితర వసతిగృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండురోజుల పాటు ఓయూ హాస్టల్స్ సమస్యల పరిష్కార యాత్ర ఉంటుందన్నారు. వీటి ద్వారా గుర్తించిన సమస్యలను యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఐదో తేదీన హాస్టల్స్ ఓపెన్ చేస్తామన్న అధికారులు, కరోనా నిబంధనలకు అనుగుణంగా వాటిని సన్నద్ధం చేయలేదన్నారు. గతంలో ఏ రకంగా హాస్టల్స్ ఉన్నాయో అది పరిస్థితి ఇప్పటికీ నెలకొందన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు వచ్చేలోగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ హాస్టల్స్ సమస్యలపై అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవింద్, కరణ్, విజరు శ్రవణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.