Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాఠశాలలు రీ-ఓపెన్ అయిన రెండవ రోజూ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ కాలం పాటు విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా బుధవారం స్కూళ్లు పున:ప్రారంభమయ్యాయి. చాలారోజుల తర్వాత విద్యార్థులు బడులకు రావడంతో మొదటి రోజు కంటే రెండవ రోజూ మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ.. ఒకరినొకరు పలకరించుకోవడం లాంటివి కనిపించాయి. ఇక మొదటి రోజూ 21.44శాతంతో అంతంగానే హాజరు నమోదైంది. పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు యాజ మాన్యం అందుబాటులో ఉంచిన శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు చర్యలు చేపడతున్నారు. చాలామంది హెడ్లు, టీచర్లు తరగతి గదులు తిరుగుతూ పాఠశాలల్లో ఉండే కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎక్కువ మంది విద్యార్థులు గుమిగూడి ఉండవద్దని, జర్వం తదితర ఆర్యోగ సమస్యలు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో మొత్తం 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 83,841 మంది విద్యార్థులు చదువుతుండగా.. 22,643 మంది హాజర య్యారు. 245 ఎయిడెడ్ పాఠశాలల్లో 36,782 విద్యార్థు లకుగాను 2966 మంది వచ్చారు. 1886 ప్రయివేటు స్కూళ్లు 1221లో పాఠాలు షురూ అయ్యాయి. వీటిల్లో 6,58,631 మంది విద్యార్థులకు గాను 1,51,536 మంది బడులకు హాజరయ్యారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 2821 స్కూళ్లలో 2156 స్కూళ్లకు గాను 7,79,254 విద్యార్థులకు గాను 1,77,145 మంది హాజరైనట్టు విద్యాశాఖ గణాం కాలు చెబుతున్నాయి. ప్రయివేటులో అఫ్లైన్తో పాటు ఆన్లైన్కూ అవకాశం కల్పించడంతో చాలామంది తల్లిదండ్రులు రెండవరోజూ ఆన్లైన్ క్లాసులకే మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యక్ష తరగ తులు తప్ప.. ఆన్లైన్ క్లాసులు లేకపోవడంతో వారి భవితవ్యంపై నీలినీడలు నెలకొన్నాయి. అయితే కొంత మంది హెడ్మాస్టర్లు, టీచర్లు జాగత్త్రలు తీసుకుంటామని భరోసా ఇస్తే.. తమ పిల్లలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.