Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్యూటీ ఇన్స్పెక్టర్ : మండల్ వన్ కస్తూరి
నవతెలంగాణ-బేగంపేట్
విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి పాఠశాలకు రావాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ సికింద్రాబాద్ మండల్ వన్ కస్తూరి అన్నారు. గురువారం పాఠశాలలో తనిఖీల్లో భాగంగా ప్రిన్సిపల్‌తో మాట్లాడుతూ వాష్ రూమ్‌లు, టాయిలెట్లు శుభ్రంగా ఉండాలని విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనించాలని ఆమె అన్నారు. కొత్త పాఠశాలను తనిఖీ చేస్తానని, యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించా లని పాఠశాల యాజమాన్యాలకు తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పక పాటించవలసిన జాగ్రత్తలు.
ఎప్పుడూ మాస్క్ ధరించాలి, ఎక్స్ట్రా మాస్క్ వెంట తెచ్చుకోవాలి, ప్రతి విద్యార్థి వద్ద శానిటైజర్ ఉండాలని, ఎవరి వాటర్, (త్రాగు నీరు) వారే తెచ్చుకోవాలి. ఎవరి స్టడీ మెటీరియల్ వారే తెచ్చుకోవాలి, ఎవరినీ అడగవద్దు, ఎవరి వద్ద తీసుకోవద్దు. పెన్, పెన్సిల్, రబ్బర్, బుక్స్, వాటర్. రెండు మాస్కులు తెచ్చుకోవాలని, విద్యార్థులు సామాజిక దూరం పాటిం చాలి. వరుసలలో కూడా దూరం పాటించాలి. పాఠశాల పరిసరాలలో గుమిగూడటం, ముచ్చట్లు పెట్టడం నిషేధం. విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే భోజనం ముందు చేతులను సబ్బుతో కట్టుకోవాలని ఆమె సూచించారు.