Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది. ఆలయ ఈవోకు కూడా దేవాదాయశాఖ అధికారులు జీవో కాపీని అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి లోకి వచ్చే ఈ దేవాలయానికి సంబంధించిన చైర్మెన్ పదవిని ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గత సంవత్సరం ఆలయ కమిటీని ఏర్పాటు చేయలేదు. చైర్మెన్ పదవి కోసం కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల్లో విపరీతమైన పోటీ ఉండటంతో ఎమ్మెల్యే సాయన్న కమిటీ ఎన్నికను పెండింగ్‌లో పెట్టించారు. తాజాగా ఈ ఏడాది కోసం దేవాదాయ శాఖ జీవో జారీ చేయడంతో కమిటీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న ఓ ఒప్పందానికి వచ్చి చైర్మెన్ పదవిని మంత్రి నియోజకవర్గానికి చెందిన ఒకరికి ఇచ్చేలా లైన్ క్లియర్ అయిపోయింది. ఎమ్మెల్యే సాయన్న నియోజక వర్గానికి చెందిన ఆరుగురికి ధర్మకర్తల పదవి ఇవ్వనున్నారు. మరో వారంలోగా ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దేవాదా యశాఖ సూచనల ప్రకారం 14మంది ధర్మకర్తలు ఉంటా రు. (ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులు ఉంటారు) వారిలో ఒకరిని చైర్మెన్‌గా ఎంపిక చేసుకుంటారు. చైర్మెన్ అభ్యర్థిని కూడా ఇప్పటికే మంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ధర్మకర్తలుగా ఎంపికైనవారి పేర్లు :
1. తీగుళ్ల కష్ణ కుమార్ గౌడ్ 2. వోదెల సత్యనారాయణ,
3.ఎస్.ఎస్.జయరాజ్, 4.పి.మహేందర్‌కుమార్,
5. బి.సాయి ప్రకాష్, 6.అమరేందర్ 7.పిల్లి శ్రీనివాస్‌రావు, 8.వజీర్ మోహన్, 9.హనుమంత్‌రావు, 10.వీరాలా యాదవ్ 11.ఆంజనేయులు, 13.నల్లమోతు అనిత, 14.రామ్మోహన్, 15.చిందం శ్రీశైలం, 16. కె.శ్రీను,