Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
గురువారం సాయంత్రం, రాత్రి గ్రేటర్ హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు, ప్రయాణికులు, రోడ్ సైడ్ వ్యాపారులు, అవస్థలు పడ్డారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వవర కాలనీ, పంజాగుట్ట ప్రధాన రహదారులపై నీరు భారీగా నిలిచింది. డ్రయినేజీలు, నాలాలు, మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. కష్ణానగర్ ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు తోపుడుబండ్లు వాననీటిలో కొట్టుకుపోయాయి.