Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో ఉన్న అంతర్గత రోడ్ల అభివద్ధికి చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శాంతి నగర్లో రూ.26లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతినగర్ లో ఉన్న రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడం, పైప్లైన్లు ఏర్పాటు చేయడంతో గుంతలుగా మారడం జరిగిన విషయాన్ని స్థానికులు తన దష్టికి తీసుకువచ్చారన్నారు. కొన్ని నెలల కిందనే ప్రతిపాదనలు తయారు చేసి నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. అయితే కాంట్రాక్టర్లు సమ్మెలో ఉండటంతో ప్రారంభోత్సవం ఆలస్యమైందని, లేదంటే ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, జలమండలి ఏఈ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకష్ణ, టీఆర్ఎస్ నాయకులు సీనియర్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, సుభాష్, చంద్రమోహన్, బాగ్ అంబర్ పేట డివిజన్ బిజెపి అధ్యక్షుడు చుక్క జగన్, నాయకులు బాలరాజు, శ్రీహరి, సురేష్, సాయి, వెంకట్,బాలు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా పిల్లిన