Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్
నవతెలంగాణ - బంజారాహిల్స్
వారిద్దరి ఆధ్వర్యంలో కోవిడ్ అనంతరం మొట్ట మొదటి వినాయక చవితి పండగ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే మండపాలలో కోవిడ్ నియమని బంధనలు తప్పనిసరిగా పాటించాలని బంజారా హిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు పాటించాలని స్తంభాలకు కరెంటు వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, శబ్ద కాలుష్యం, దశ్యం భారీ శబ్దాన్ని వినియోగించకుండా మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలని ముఖ్యమైన సూచనలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవిడ్ మహమ్మారి థర్డ్‌వేవ్ దష్టిలో ఉంచుకొని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అందరూ సురక్షితంగా ఉండాలని అన్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 2వేలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే దిశగా ఉన్నారని మండల ఇన్చార్జిలు అందరు హాజరై తమ తమ పరిధిలో ఉన్న వాటిని సంరక్షిం చుకునే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. రహదారుల మూసివేత ఫుట్‌పాత్ ఆక్రమణ చేయ వద్దంటూ హితవు పలుకుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగానే పండగ నిర్వహించుకోవాలని పండగలు శాంతి, ఐక్యతకు చిహ్నంగా జరుపుకుం టామని ఈ సందర్భంగా ఏసీపీ సుదర్శన్ ఇన్స్పెక్టర్ శివ చంద్రలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శివచంద్ర, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.