Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పోషణ మాసొత్సావలు కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ సీతాఫలమండి సెక్టార్ నందు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు తక్కువ ఖర్చులో పోషణాహరం, పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఆరోగ్య శుభ్రతకు సంబంధించిన అలవాట్లపై అవగాహన కల్పించారు. కింది బస్తీి అంగన్వాడి సెంటర్ పరిధిలోని కమ్యూనిటీ హాల్లో గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఏ ఆహార పోషకాలు తీసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీడీఓ సునంద,హైదరాబాద్ ఇన్చార్జి భరత్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు