Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీలో మా విల్లాస్ నందు పార్కు స్థలం గతంలో కబ్జా యత్నించడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలం బోర్డు ఏర్పాటు చేశారని, సదరు కబ్జాదారుడు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మరుసటి రోజే బోర్డును తొలగించడం పట్ల మున్సిపల్ అధికారులు సదరు కబ్జాదారుడికి తొత్తులుగా వ్యవహరిస్తు వారి కనుసన్నల్లోనే కబ్జా వ్యవహారం జరుగుతుందని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ తెలిపారు. శుక్రవారం కౌసల్య కాలనీ విల్లాస్ పార్కు స్థలాన్ని సతీష్ నేతత్వంలో పరిశీలిం చారు. బోర్డు తీసేయడాని తీవ్రంగా ఖండిస్తున్నా మని, గతంలో బోర్డుపై పేరు తొలగించి రంగు వేయడాన్ని తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేసిన అధికారులు, అధికారులు ఏర్పాటు చేయించిన బోర్డు పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అధికార పార్టీ, నాయకుల, ప్రజా ప్రతినిధుల పట్ల వివరించిన తీరుకు అద్దం పడుతుందని తెలిపారు. ఈ బోర్డు తీరుపై ఇప్పటికే మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా బోర్డు తొలగించిన వారిపై కేసు నమోదు చేయలేదని, అదేవిధంగా బీసీ కమిషనర్‌కు సైతం ఇక్కడి కబ్జాల వ్యవహారంపై ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ బోర్డు తొలగింపు అధికారుల వైఖరిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే సహకరిస్తున్న అధికారులే అని ఇప్పటికైనా బోర్డు మరల ఏర్పాటు చేసి చర్యల తీసుకోనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేసి పార్కును కాపాడతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కష్ణ, నరేంద్ర చౌదరి ,సెక్రెటరీ అరుణ్ కుమార్ , కాలనీ వాసులు వెంకటేశ్వరరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.