Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న నవ గ్రహ విగ్రహాలను మతి స్థిమితం లేని వ్యక్తి చిందరవందరగా పడేసిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం పెద్ద అంబర్ పేటలోని లక్ష్మ రెడ్డి పాలెంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గురువారం రాత్రి సమయంలో అక్కడికి మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి గుడి ప్రాంగణంలోకి విచ్చేసి అందులో ఉన్న మైక్, పూల కుండీలు, నవగ్రహాల విగ్రహాలను చిందర వందరగా పడేయడంతో ఘటన స్థలానికి పలు పార్టీలకు చెందిన నాయకులు చేరుకుని రోడ్ పై ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని సముదాయించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.