Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామిడి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
నవతెలంగాణ - మీర్పేట్
రాష్ట్రమంతటా దళితబంధు పథ కాన్ని అమలు చేయాలని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దళిత- గిరిజన ఆత్మగౌరవ యాత్రలో బాగంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో గడప గడపకు దళిత ఆత్మగౌరవ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఇక్కడ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎంతో మంది దళితులకు ప్రతి కుటుంబానికి 222 గజాల ప్లాట్ కేటాయించి దళితులకు భరోసా కల్పించారని ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్లలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నరని తెలిపారు. దానికి విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కోసం దళిత ప్రజలకు మాయమాటలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితుల, ప్రభుత్వ భూములను అమ్ముకుంటు ప్రజలను మద్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికైనా రాష్ట్రంలో ఉన్న దళితులందరికి దళిత బందు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె ఈశ్వరయ్య, డి కిషన్, భిక్షపతి, వెంకటయ్య' శ్రీనివాస్, కాల కుమార్, అల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, కార్తిక్ రెడ్డి, వెంకటేష్, విక్రమ్, వివిధ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.