Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-ఉప్పల్
నాణ్యమైన వస్తువులను అందించి ప్రజల మన్ననలు పొందాలని ఫిర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. ఉప్పల్‌లోని జారు ఈ బైక్ షోరూం టీఆర్ఎస్ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్వరుడితో కలిసి షోరూంను ప్రారంభించిన అనంతరం బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ భారీగా పెట్రోల్ ధరలు పెరిగిన తరుణంలో ఎలక్ట్రానిక్ బైక్ ల ఉపయోగం ద్వారా సాధారణ మధ్య తరగతి ప్రజలకు పెరిగిన పెట్రోల్ ధరల భారం తగ్గనుందని, అదేవిధంగా కాలుష్యం నియంత్రణ పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అని అన్నారు. కేవలం మూడు యూనిట్లు కరెంటుతో 75 కిలోమీటర్ల ప్రయాణించ వచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ నాయకులు ఏదుల కొండల్‌రెడ్డి, మాస శేఖర్, మహమూద్, నారాయణ రెడ్డి, బింగి శ్రీనివాస్
జారు ఈ బైక్ షోరూం యజమాని బొల్లంపల్లి సంతోష్ రెడ్డి, వారి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.