Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ పరిరక్షణ కోసం నిబద్ధతను చాటిన రామ్కీఎన్విరో
నవతెలంగాణ-సిటీబ్యూరో
పండుగ స్ఫూర్తి పరంగా ఏమాత్రం రాజీపడకుండా పర్యావరణంపై పండుగలు చూపే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గాల పట్ల అవగాహన కల్పిస్తూ రామ్కీ ఎన్విరో, బిగ్ఎఫ్ఎం 13ఏండ్లుగా బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమం నిర్వహిస్తు న్నాయి. ప్రతి సంవత్సరం పర్యావరణ అనుకూల గణేశ విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం తమ బిగ్ గ్రీన్ గణేశా 14వ ఎడిషన్‌లో భాగంగా భాగంగా రామ్కీ ఎన్విరో, బిగ్ ఎఫ్ఎంలు గణేశా మట్టి విగ్రహాలను బయోడీగ్రేడబల్ కుండీలో విత్తనాలను కూడా జోడించి అందిస్తున్నాయి. ఈ సందర్భంగా రీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 'పర్యావరణ అంశాలకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అవార్డులు గెలుచుక్ను గ్రీన్ గణేశా 14వ ఎడిషన్ కోసం బిగ్ ఎఫ్ఎంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. బయోడీగ్రేడబల్ గణేశ విగ్రహాలను కమ్యూనిటీలు, ఉద్యోగులు, భాగస్వాముల నడుమ పంపిణీ చేయనున్నాం. తద్వారా పర్యావరణ అనుకూల ప్రక్రియలను అనుసరించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహిస్తు న్నాం. పర్యావరణ అనుకూల గణేశ విగ్రహాలను హైదరాబాద్‌లోని పలు గేటెడ్ కమ్యూనిటీలలో పంపిణీ చేయనున్నాం. తద్వారా పర్యావరణ నష్టాన్ని తగ్గించే అవకాశముంది. ఈ విగ్రహాలను సెప్టెంబర్ 03 నుంచి సెప్టెంబర్ 09వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నాం. సుప్రసిద్ధ తెలుగు సినీ, టీవీ సెలబ్రిటీలు నాని, రావురమేష్, ఆర్పీ పట్నాయక్, తనికెళ్ల భరణి, గోపిచంద్, ప్రియమణి, కార్తికేయ, సుధీర్‌బాబు, ఈషా రెబ్బా లాంటి వారు ఈ పర్యావరణ అనుకూల గణేశా ప్రచారం చేయనున్నారు ' అని అన్నారు.