Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
మోంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ నందు గహకార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ (గుట్స్) మెంబర్స్ అసంఘటిత కార్మికుల నమోదు కార్యక్రమం విజయంతంగా జరిగింది. ఈ కార్యక్రమం నందు 50 మంది గహ కార్మికులను నమోదు చేయడం జరిగింది. వారికి ఈ నమోదు కార్యక్రమం ద్యారా కలిగే ఉపయోగాలను, దీని ప్రాముఖ్యతను వారికి వివరిం చటం జరిగింది. ఈ నమోదుకు ప్రతి కార్మికుడు వారి ఆధార్ కార్డుని, ఫోన్ నెంబర్కి అనుసంధించాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, సిస్టర్ జెనెస్టస్, స్టేట్ కో-ఆర్డినేటర్ గహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ (గుట్స్), వల్లాల మంజుల, కో-ఆర్డినేటర్ గహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ (గుట్స్), వివేక్ జోసెఫ్, కమ్యూనికేషన్ కో-ఆర్డినేటర్ మోంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్, బి వాసు, ఫీల్డ్ మొబిలైజర్ ఇండియా లేెబర్ లైన్ పాల్గొని కార్మికులను నమోదు చేసారు.
నాయి బ్రాహ్మణులకు