Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ నరసింహ
నవతెలంగాణ-కంటోన్మెంట్
పాత బోయిన్పల్లి డివిజన్లో పలు కాలనీలలో శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి భూగర్భ డ్రయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 276.25 కోట్ల వ్యయంతో శాంతినికేతన్ కాలనీ నందు హరిజన బస్త్తీి కమ్యూనిటీ హాల్ దగ్గర, మదర్స్ రామకష్ణ స్కూల్ పక్కన, లక్ష్మీనర్సింహ కాలనీ నందు, టీచర్స్ కాలనీ భవాని నగర్లో, మణికంఠ కాలనీ దగ్గర, ఎల్.బి.నగర్, రెడ్డి హోటల్ దగ్గర, కోయ బస్తీలో, హస్మత్‌పేట్, హనుమాన్ టెంపుల్ దగ్గర, ఎం.ఐ.ఎం.ఆఫీస్ ప్రక్కన, అబ్రహార్ నగర్, కల్వర్ట్ దగ్గర, అంజయ్య నగర్, మిర్చి గోపాల్ ఇంటి దగ్గర ఇంకా, సిండికేట్ బ్యాంకు ఆఫీసర్స్ కాలనీ వద్ద్ద భూగర్భ డ్రయినేజీ పనులు నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కర్రే లావణ్య, సదరన్ రైల్వే బోర్డు మెంబెర్ కర్రే జంగయ్య, కాన్సిటెన్సీ అధ్యక్షులు ఇజాజ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, మజ్జి కౌన్సిలర్ మక్కల నర్సింగ్, బల్వంత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్-చైర్మన్ ఉదరు యాదవ్, మహిళా అధ్యక్షులు లలిత, వార్డ్ మెంబర్లు, ఏరియా సబ్ మెంబర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.