Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రికలర్ హాస్పిటల్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్
అంబర్పేట్లోని ట్రికలర్ హాస్పిటల్లో వెన్నెముక సంబంధిత రోగాలకు అతి తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించనున్నట్లు డాక్టర్ సుబ్బయ్య తెలిపారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వీసుకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్గా మారి నగరవాసులకు సేవలందించడం సంతోషకరమన్నారు. వెన్నెముక సర్జరీ కోసం కొత్తగా ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించామన్నారు. దీంతో పూర్తి కాలం స్పైన్ సర్జరీ సర్వీసెస్ వైద్య చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. ఇతర కార్పొరేట్ హాస్పిటళ్ల చికిత్సకు తీసిపోకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఈ చికిత్సకు అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. ఇదే చికిత్సకు కొన్నిచోట్ల రూ.2 లక్షలు వరకు అవుతోందని, తమ వద్ద రూ.1.20 లక్షలకే చికిత్స అందుతుందని చెప్పారు. ట్రికలర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. స్పైన్ సర్జరీ ట్రీట్మెంట్ కోసం సుబ్బయ్యతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి నూతన సీఈవో డాక్టర్ పట్నాయక్ హాజరయ్యారు.