Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
గురువారం కురిసిన భారీ వర్షానికి మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లెనిన్ నగర్, ప్రశాంతి నగర్ ఫేజ్ -1,2, అయోధ్యనగర్, ఎంఎల్ఆర్ కాలనీ, మిథుల నగర్, శ్రీధర్ కాలనీ, బాలాజీ కాలనీ, సాయి నగర్, శ్రీనివాస గాయత్రీ నగర్ తదితర కాలనీల్లో గురువారం కురిసిన వర్షాలకు వరద నీరు ముంచెత్తి ఇండ్లల్లోకి చేరింది. దీంతో ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ ఇబ్బంది పడ్డారు. చంటి పిల్లలు, వద్ధులు ఉండటంతో అనేక కుటుంబాలు తమ ప్రాణాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. మున్సిపల్ అధికారులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఉదయం సహాయక చర్యలు చేపట్టి ఇండ్లలో చేరిన వరదనీటిని పంపించే ప్రయత్నం చేశారు.