Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అనాథ పిల్లలకోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మా ఇల్లు వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లిలోని ఫ్యాప్సిలో మా ఇల్లు, బాలవికాస, ఎన్వి పౌండేషన్, డాన్ బాస్కో, నవజీవన్, అనాథ హక్కుల కార్యకర్తలు ఎన్జీవో, సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయా సంస్థల నాయకులతో కలిసి మాట్లాడారు.18 ఏండ్ల పిల్లల కోసం ఉద్దేశించిన జువైనల్ యాక్ట్ అనాథలకు పూర్తి న్యాయం చేయలేదనానరు. అనాథలకు ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, ప్రయాణ సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అనాథలపౖౖె సమగ్ర జనగణన చేసి వారిని వర్గీకరించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగానే అనాథ రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర అనాథల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ వేయడం హర్షణీయమన్నారు. ప్రాపర్టీ సెక్యూరిటీ లేని వాళ్లకు ఎక్కువ బెనిఫిట్స్ అనాథ వైకల్యం ఉన్న వారికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి ప్రసాదరాజు, బాలవికాస ప్రతినిధి శివారెడ్డి, డాన్ బాస్కో నవజీవన్ ప్రతినిధి ఫాదర్ కౌశి, సామాజిక కార్యకర్త స్నేహ, అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.