Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలోని చిరాగ్ అలీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాదర్ఘాట్-2లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి కొవిడ్-19 నిబంధనలు పాటించాల్సిందిగా హెచ్ఎంలకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించడంతో పాటు తరగతి గదుల్లో డిస్టెన్స్ పాటించాలన్నారు. క్లాస్ రూమ్లల్లో స్టూడెంట్స్తో కాసే ముచ్చటించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, ప్రతిరోజు తరగతి గదులను శానిటైజ్ చేయాలన్నారు. హెచ్ఎంలు అర్పిత, శ్రీనివాస్ రెడ్డి, టీచర్లు ఉన్నారు