Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి.జి సాయిలు గౌడ్ అన్నారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా డిజి. సాయిలు గౌడ్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ధరణి పోర్టర్లో లోపాలను సరి చేయాలని, రైతుబంధు, రైతు బీమా, పంట రుణాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని కోరారు. భూ సమగ్ర సర్వే తక్షణమే ప్రారంభించి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మిగిలి పోయిన సాదా బైనామాలను తక్షణమే రెగ్యుల రైజ్ చేసి ధరణిలో నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని, భూ ఆక్రమణలను అడ్డుకోవాలని కోరారు. పట్టా దారు మరణిస్తే వారి వారసుల పేర విరసత్ చేసి పట్టా పాస్ బుక్ జారీ చేసి రైతు బంధు, బీమా అందించాలని కోరారు. 2006 అటవీ హక్కులచట్టం ప్రకారం పోడు సాగు రైతులకు పట్టాలు ఇచ్చి రైతు బంధు, బీమా, షరతులు లేని బ్యాంక్ రుణాలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొయ్యల కష్ణమూర్తి, తోట పల్లి శంకర్, ఉమ మహేష్, కే.జయచంద్ర పాల్గొని ప్రసంగించారు. ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటచారి, ఆయా మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.