Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మట్టి కుప్పలు చెత్త ఎక్కడ ఉన్నా నా దష్టికి తీసుకు రండి, క్లీన్ అండ్ గ్రీన్ చేస్తాము ప్రజలు మరల కూడా చెత్త పోగుచేయకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు. మీ నివాస పరిసరాలలో ఎక్కడైనా మట్టికుప్పలు చెత్త చెదారం ఉన్నట్లయితే తన దష్టికి తీసుకువస్తే క్లీన్ అండ్ గ్రీన్ చేస్తానని తెలిపారు. తొలగించిన తర్వాత ప్రజలు కూడా మరల చెత్త పోగు చేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. రోడ్డు పక్కన చెత్త చెదారం మట్టి కుప్పలతో పాటు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడంతో రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బ్రిడ్జి కింద రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని జనప్రియ అపార్ట్‌మెంట్‌వాసులు స్థానిక ప్రజలు శుక్రవారం డిప్యూటీ మేయర్ దష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. స్పందించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి లాలాపేట్ బ్రిడ్జి కింద ఉన్నటువంటి మట్టి కుప్పలు చెత్తాచెదారం పాడైపోయిన వాహనాలతో పాటు స్థానిక ప్రాంతాలు, జనప్రియ అపార్ట్మెంట్ పరిసరాలను పరిశీలించారు. దీనితో బ్రిడ్జి కింద ఉన్నటువంటి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి డిప్యూటీ మేయర్‌కు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. దీనితో స్పందించిన డిప్యూటీ మేయర్ మీ సమస్యలను పరిష్కరించి తార్నాక డివిజన్‌ను గ్రీన్ డివిజన్‌గా మారుస్తానని, మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కేటీఆర్ ఆదేశాలు సూచనలతో హైదరాబాద్ మహానగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆ దిశగా ప్రజలకు పరిశుభ్రతలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాలాపేట్ బ్రిడ్జి కింద ఉన్న మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి పార్క్ ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు, ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా తొలగించి నూతనంగా కేబుల్ వైరు ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు. రాత్రి సమయంలో బ్రిడ్జి కింద చుట్టుపక్కల ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా లైటింగ్ ఏర్పాటు చేసి, కెమెరాలు బిగించి నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఇకమీదట ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
దోమలకు ఆవాసాలుగా తయారు చేయకండి
దోమల వద్ధి పెరిగేందుకు ఆస్కారమున్న వాడి మూలకు పడేసిన టైర్లు, కూలర్, పూల కుండీలు, ఇంటి ఆవరణలో ఎప్పుడూ నిలిచి ఉండే చిన్న చిన్న వాటర్ కుండీల ద్వారా దోమలు వద్ధి పెరిగే ఆస్కారం ఉందని మన ఇంటిని దోమలకు ఆవాసంగా చేయకూడదన్నారు. ఇంటి లోపల వాడి పడేసిన వస్తువులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జిహెచ్ఎంసి సిబ్బంది కి అందిచి దోమల నివారణకు సాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటియుసి వ్యవస్థాపక అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, ఎ ఎమ్ హెచ్ ఓ రవీందర్, ఇతర జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.