Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాలనీలోని ఇండ్ల ముందు మురుగు మలినాలు తిష్ట వేసి కుళ్ళి కంపు కొడుతున్నాయని, జారుడు తో పాకురు పట్టి ఇళ్ల ముందు నుంచి అడుగు తీసి అడుగు వేయలేక నానా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎడతెరిపిలేని వర్షాలు ఇండ్ల ముందు మురుగు వరద నీటి మూలంగా చంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని అసలే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పందుల సంచారం, ఈగలు, దోమలతో డెంగ్యూ, మలేరియా సోకే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, పారిశుద్ధ్య విభాగం వైద్యాధికారి డాక్టర్ మైత్రేయి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ఇళ్ల ముందు పేరుకుపోయిన మురుగు మలినాలను తొలగించి బ్లీచింగ్, రసాయనాలను పిచికారి చేయాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య జోడించి వేడుకుంటున్నాం.