Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్క ముస్లిం, మైనారిటీ సోదరులు వ్యాక్సిన్ వేయిచుకోవాలని జల్పల్లి మున్సిపల్ రిప్రజెంటెటివ్ వైస్ చైర్మన్ యూసూప్ పటేల్ పిలుపునిచారు. ఆదివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వెంకటాపూర్ గ్రామంలో కోవిడ్ ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రంలో మొదటి డోస్ కొవిషీల్డ్ వేయించుకున్న జలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సయ్యద్ యూసఫ్ పటేల్, సయ్యద్ అలీ పటేల్ సోదరులు వేయించుకున్నారు. ఈ సందర్బంగా యూసుఫ్ పటేల్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎవరూ కూడా వ్యాక్సిను పట్ల అపోహలు చెందవద్దని, ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.