Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యతిరేకిస్తూ ఆదివారం లాలపెట్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి అధికారం లోకి వచ్చాయి. రెండు ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు స్థాపిస్తామని, లక్షల, కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు నోట్ల రద్దు, జీఎస్టీి, ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి, ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీదారులకు కట్టబెట్టడం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాలు అని సికింద్రా బాద్ కార్యదర్శి ఎం.అజరు బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సెంటిమెంటును ఉపయోగించు కుని వేల కోట్లు దోచుకుందని, లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అర్హులందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలని, కార్మిక హక్కులను హరించే కార్మిక కోడ్లను రద్దు చేయాలని, ఇన్‌కమ్‌టాక్స్ పరిధిలో లేని పేదలందరికీ నెలకు రూ.7,500 ఇవ్వాలని, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి సీపీఐ(ఎం) కార్యదర్శి ఎం.అజరు బాబు అన్నారు. కార్యక్రమంలో గోపాల్, కపాకర్, కిరణ్, నర్సింగ్, పద్మ, భీమయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.