Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
పేదల అభివృద్ధి జరగాలి అంటే వామపక్ష ప్రభుత్వా లు రావాలి అనీ సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా నాయకులు అన్నారు.సరూర్నగర్ సర్కిల్ మహా సభలు దిల్సుఖ్నగర్ మున్సిపల్ కాలనీలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వ రరావు భవన్లో ఆదివారం జరిగింది. ఈ మహా సభకు అధ్యక్ష వర్గంగా జి.మనోహర్, మసూద్, అమతమ్మ అధ్యక్ష వర్గం వహించారు. ముఖ్యఅతిథి గా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య హాజరై మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీి పాలకులు ప్రజల ధన, మాన, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని అయన ఆరోపించారు. ప్రజా అవసరాల ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన పాలకులు ఎల్ఐసి, రైల్వే, బీమా, స్టీల్, చివరకు రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. కరోనా టైములో ప్రజల ఆరోగ్యంతో చలాగాటం అడారు, కనీసం టీకాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వ రంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వ నియంతత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం బండి సంజరు లాంటివారు పాదయాత్ర పేరుతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్న ప్రజలను మతాల పేరుతో, కులాల పేరుతో చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీస్తు న్నారని అన్నారు. బండి సంజరు దేశంలో పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ రేట్లు స్పందించడం లేదు అన్నారు. రైల్వే, ఎల్ఐసి, స్టీల్ సంస్థలను ఎందుకు ప్రైవేటీకరించరో ప్రజలకు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ దొంగాట ఎండగట్టి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భతి, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు, బీజేపి మతతత్వంతో రెచ్చిపోతే ఎండగట్టడంలో ప్రభుత్వం విఫల మయ్యింది అన్నారు. టీిఆర్ఎస్, ఆపద పథకాలను ప్రకటించి గట్టెక్కాలని చూస్తుంది అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, సిపిఎం సర్కిల్ కార్యదర్శి సిహెచ్ వెంకన్న, వీరయ్య, కట్టా శ్రీనివాస్, జి మనోహర్, అమతమ్మ, ఎస్.కె మసూద్, గోపీనాయక్, రాజు, కడారి రాములు పాల్గొన్నారు.