Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నేటి సమాజంలో ప్రత్యేకించి మహిళలు, బాలికలకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్గించి ప్రజలను చైతన్యపరిచే సినిమాలు రావాలని రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు వాణి దేవి అన్నారు. ఎల్.వీ.ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో యువ దర్శకుడు కుమారస్వామి రచించి దర్శకత్వం వహించిన 'చిట్టి-ది మిస్సింగ్ గర్ల్' చిత్రం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవిక పరిస్థితిని స్వచ్ఛతగా చిత్రీకరించారని అభినందించారు. ఈ సందర్భంగా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన నటులకు యోగ్యత పాత్రలను వాణిదేవి బహుకరించారు. ప్రిన్సిపల్ కుమార స్వామి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిత్ర రంగంలో వివిధ శాఖలకు చెందిన పలువురకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్ షో ఆకట్టుకొంది.