Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎంతో కషి చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 14వ డివిజన్లోని వెంకటాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మారి స్వచ్ఛంద సంస్ట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా నియంత్రణ టీకా కార్యక్రమానికి మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి, కార్పొరేటర్ జెనిగె భారతమ్మ కొమరయ్యలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధకష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ్డి అదేశంతో కార్పొరేషన్లోని అన్ని డివిజన్లల్లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బొర్ర జగన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జె.శ్రీనివాస్ యాదవ్, కుక్కల పురుషోత్తం యాదవ్, మారి స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ సాంబశివ, నాయకులు అర్.కుమార్ గౌడ్, సంజరు సింగ్, శ్రీకాంత్, సురేష్ యాదవ్ పాల్గొన్నారు.