Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి
నవతెలంగాణ-కాప్రా
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి కోరారు. శనివారం మల్లాపూర్‌లోని విఎంఆర్ గార్డెన్లో మల్కాజ్గిరి జోన్ పరిధిలోని మండప నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు మూడో విడత కరోనాను దష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతిరోజు మండపాల వద్ద జీహెచ్‌ఎంసీి అధికారులు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. మండపాలు ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీసీపీ కోరారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్ వివిధ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.