Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్ పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామంలోని 11వ డివిజన్లో పుష్పగిరి ఆస్పత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుచేసినట్లు 11వ డివిజన్ కార్పొరేటర్ చుక్క శివ కుమార్ తెలిపారు. ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టీఆర్ఎస్ మహేశ్వరం నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్ సహాయంతో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 50మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీచేశారు.