Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారిని సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులేనని రాజధాని హైస్కూల్ చైర్మెన్, కరస్పాండెంట్ యదా నరేంద్ర అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్లోని రాజధాని పాఠశాల అవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్య తరగని సంపద అని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, పలు రంగాలల్లో రాణించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రేణుక నరేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్లో ....
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్లో గల శ్రీసాయి విద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల అవరణంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పాఠశాల కరస్పాండెంట్ బి.ఆంజనేయులు పాల్గొని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనతో పాటు ప్రిన్సిపల్ శోభారాణిలను శాలువాతో, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.