Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్ దరఖాస్తుల పక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. కాగా గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో గర్ల్స్ దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఓయూ ఆర్ట్స్, సైన్సు, కామర్స్ కళాశాలాల పరిధిలో సుమారు 916 దరఖాస్తులు వచ్చాయి. ఎంపికైనవారికి మొబైల్‌కు ఎస్ఎంఎస్లు పంపించామని, పేమెంట్ ఆప్షన్స్ ద్వారా కేటగిరీవారీగా ఫీజులు చెల్లించాలని ఓయూ చీఫ్ వార్డెన్ డా.కొర్రెముల. శ్రీనివాసరావు కోరారు. ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఓయూ చీఫ్ వార్డెన్ కార్యాలయంలో మెస్ కార్డ్ తీసుకొని వారికి సంబంధించిన హాస్టల్లో రిపోర్ట్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఇక మెస్‌లు మంగళవారం మధ్యాహ్నం భోజనం నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
నాన్ బోర్డర్స్ రూమ్స్ స్వాధీనం
ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలో నాన్ బోర్డర్స్ ఉన్న రూమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు సంఘాల రూమ్స్ బయట ఉన్న బ్యానర్స్, నేమ్ బోర్డ్స్ తొలగించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓయూ వీసీ ప్రొ. రవీందర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి, నాణ్యమైన ఆహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైన్సు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.జితేందర్ నాయక్, అడిషనల్ చీఫ్ వార్డెన్ డా.లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.