Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సకల సౌకర్యాలతో వైకుంఠధామాలను ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి గ్రామంలో రూ .కోటి రూపాయలతో నిర్మించనున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైకుంఠధామాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరంగా ఉండేవిధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి, వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు గోక కళావతి యాదగిరి, పంబల్ల సరితా రమేష్, లక్ష్మీవేణు, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, మమత కృష్ణరెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు గండి అంజయ్య గౌడ్, వరకల పెంటయ్య గౌడ్, శ్రీశైలం మీసాల ఎల్లమయ్య, యువ నాయకుడుకౌకుంట్ల రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలాజీనగర్లో సీసీ కెమెరాలు ప్రారంభం
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు ఆదివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు బాలాజీ నగర్ కాలనీ ఫేజ్ 2లో టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓర్సు రాములు రూ. ఐదు లక్షలుతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. బాలాజీ నగర్ కాలనీలో ఐదు లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు ఓర్సు రాములును మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో దమ్మాయిగూడ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మెన్ నరేందర్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మెన్ చంద్రారెడ్డి, కీసర సీఐ నరేందర్ గౌడ్, దమ్మాయిగూడ కౌన్సిలర్ వెంకటేష్, వెంకటరమణ, రమేష్ గౌడ్, నరసింహారెడ్డి, శ్రీహరి గౌడ్, నాయకులు హరిగౌడ్, కిరణ్ గుప్తా, కార్తీక్ గౌడ్, శ్రీనివాస్, నరహరి రెడ్డి, రాజేశ్వరి కాలనీ అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి రేవతి, కోశాధికారి రామారావు పాల్గొన్నారు.