Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ - అడిక్‌మెట్/గాంధీనగర్
'హలో ఎమ్మెల్యే' కార్యక్రమంతో నేరుగా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా మూడవ విడత 'హలో ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలతో ఫోన్ ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. అందులో ముఖ్యమైన సమస్యలు జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ స్థానిక అవసరాల కోసం నిర్మిస్తే జీహెచ్ఎంసీ అధికారులు ఎవ్వరికీి ఇవ్వకుండా చెత్త డంపుగా మార్చారు. స్థానికులు ఫంక్షన్లు నిర్వహించుకునేలా అవకాశం కల్పించండి. పద్మశాలి కాలనీ, పార్శిగుట్ట గుడ్షపర్డ్ స్కూల్ వద్ద పోకిరీల బెడతదో ఇక్కట్లు పడుతున్నాం... పఠాన్ బస్తీకి అధికారులు వస్తున్నరు.. పోతున్నరు మంచినీటి సమస్య పరిష్కారం కావడంలేదు.. పరిష్కరించండి అంటూ పలువురు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఫిర్యాదు చేశారు. గాంధీనగర్, ఎస్ఆర్ పార్కు పరిసరాల్లో చెట్ల కొమ్మలను తొగించాలని స్థానికులు కోరారు. ఇక కవాడిగూడ ప్రధాన రోడ్డు నిర్మాణం చేపట్టి గణేష్ విగ్రహాల ఊరేగింపునకు ఆటంకం కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అశోక్ నగర్ పార్కు అభివద్ధి, హజార్గల్లీ సమయానుకూలంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భోలక్‌పూర్ ఇందిరానగర్ ఫెస్-2లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, ధ్వంసమైన మ్యాన్ హోల్స్ మార్చాలని కోరారు. పార్శిగుట్ట చేపల మార్కెట్ మార్గంలో రోడ్డుపై వరద నిలిచి ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందని స్థానికుడు విక్రమ్ ఫిర్యాదు చేశారు. భోలక్‌పూర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పద్మకాలనీలో స్క్రాప్ వ్యాపారులు రోడ్డును ఆక్రమించి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులతో మాట్లాడి ఆక్రమణలు, రోడ్డును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గుల్షన్‌నగర్‌లో గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అరుంధతీనగర్‌లో దోమలబెడద తగ్గించాలని, రోడ్లు రోజు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని జోనత్ విజ్ఞప్తి చేశారు. దాయర మార్కెట్లో డ్రయినేజీ సమస్య, అంజయ్యనగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరారు. ప్రజల సమస్యలకు స్పందించిన ఎమ్మెల్యే 'హలో ఎమ్మెల్యే' కార్యక్రమం ద్వారా తన దష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే ఉద్దేశ్యంలో 'హాలో ఎమ్మెల్యే' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా మూడవ విడత హలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మంచినీరు, డ్రయినేజీ, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, పోకిరీల బెడద, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మతులు వంటి సమస్యలను ప్రజలు తన దష్టికి తీసుకువచ్చారని, ప్రతి ఒక్క సమస్యను ఆయా విభాగాల అధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్యామ్, వై.శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.