Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
కర్బలా యుద్ధం మానవజాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో 'కర్బాలా నుంచి మానవత్వానికి ఇమామ్ హుస్సేన్ సందేశం' అనే అంశంపై హైదరీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేశారు. సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఫిర్దాస్ ఫాతిమా తన స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ముస్లిం సమాజంలో ముఖ్యంగా బాలికల విద్య కోసం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిచ్చారని, ఇస్లాం చరిత్ర విభిన్నమైనదని, చెప్పలేని విషాద కథలతో రూపొందించబడిందన్నారు. అలాంటి కథల్లో ఒకటి కర్బాలాలో జరిగిన సంఘటనలని వివరించారు. కర్బాలా ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానం జరిగిన ప్రదేశం, ఆయన ఉద్యమం ఒకరి సొంత ఆత్మతో ఇతరులతో వ్యవహరించేదని, ప్రతి దశలోనూ బానిసత్వంపై పాఠం నేర్పించాలనుకున్నాదన్నారు. ఇస్లాం ప్రాథమిక భావనను దాని నిజమైన స్ఫూర్తితో అర్థం చేసుకోవడం మానవత్వానికి సేవ చేయవలసిన అవసరాన్ని మరింత అందించాలన్నారు. మానవజాతి కోసం త్యాగం చేసిన వారిని మాత్రమే చరిత్రలో గుర్తుంచుకోవాలని, నిరంకుశ పాలకులను కాదని ఆయన సూచించారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ఒక ఇస్లాంను దాని సొంత అనుచరులు అర్థం చేసుకున్న రోజు నుంచి ఇతర సంస్కతులకు నమ్మశక్యం కాని కథనాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజులు, పాలకులు ఉన్నారని, కానీ ప్రజలు పెద్దగా వారిని గుర్తుంచుకోరన్నారు. ప్రజలు తమను తాము బోధించే వారిని మాత్రమే అంగీకరిస్తారన్నారు. ఇది కేవలం ఇద్దరు ప్రముఖ వ్యక్తులలో మాత్రమే హజ్రత్ అలీ, హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కనిపిస్తుందన్నారు. కర్బాలా సందేశాన్ని దాని నిజమైన స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. సయ్యద్ తథీర్ రజా కజ్మీ, రారుపూర్ సయ్యద్ తాహెర్ అబెదికి ధన్యవాదాలు తెలిపారు. హైదరీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ విద్యా సేవలు అభినందనీయమన్నారు. హైదరీ ఎడ్యుకేషనల్ ఆండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మీర్ ఫిరాసత్ అలీ బక్రీ సెమినార్లో మాట్లాడుతూ.. ముస్లింల విద్య అభ్యున్నతికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. సమాజంలో విద్యా అవగాహన తీసుకురావడంలో ముస్లిం మేధావి కీలక పాత్ర పోషించాలన్నారు.