Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మండలంలోని ఎదులాబాద్ గ్రామంలో మంత్రి మాల్లారెడ్డి ధాన్యం సోమవారం శంకుస్థాపన చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్మాణానికి సంబంధించిన సమాచారం తమకు ఇవ్వలేదని ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యలయంవద్ద నిరసన వ్యక్తం చేశారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో నిర్మిస్తున్న ధాన్యాం కోనుగోలు కేంద్రానికి ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా మంత్రి ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. మంత్రి శంకుస్థాపనలు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేయలేదని తాము మంత్రిని ప్రశ్నిస్తామనే భయంతో సమాచారం ఇవ్వలేదన్నారు. అందుకు నిరసనగా మండల పరిషత్ ఉపాధ్యాక్షురాలు కర్రె.జంగమ్మతో పాటు ఎంపీటీసీలు పులకుంటి భాస్కర్‌రెడ్డి గట్టగళ్ల రవి, కొమ్మిడి శోభరాణి, నీరుడి రామారావు, మండల పరిషత్ కర్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.