Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైద్యాధికారి యాదగిరి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి యాదగిరి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉమ్మడి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై జరిగిన సమిక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు, చికెన్ గున్యా వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని రెండు మున్సిపాలిటీలలో, గ్రామాలలో నిత్యం పొగ ప్యాగింగ్ చేయించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్లు నిల్వ ఉన్న చోట కిరోసి పోయడం గాని ఆయిల్ బాల్స్ వేయడం చేయాలని తెలిపారు. కలుషితమైన నీళ్లతో డయేరియా, కలరా, టైపాయిడ్, కామెర్లు తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. అన్ని పాఠశాలలో కోవిడ్ నిబంధనలకు పాటించే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కృషిచేయాలని కోరారు. పిల్లలో ఏదైన కోవిడ్ లక్షణాలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అన్ని వేళలో ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ అవసరత వచ్చిన వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ, పోచారం మున్సిపాలిటీ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, ఘట్కేసర్ చైర్మెన్ ముల్లి పావని జంగయ్య యావద్, కమిషనర్లు సురేష్, వసంత, కౌన్సిలర్లు సుర్వి సుధాలక్ష్మీ, మోటుపల్లి పోచమ్మ, కొ ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ ఆలీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.