Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద ఊరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సబ్సిడీ రుణాలు కోసం 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 వేల మందికి రుణాలు మంజూరు చేశారన్నారు. మిగిలిన ఐదు లక్షల 27 వేల మందికి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 7861 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శరత్, ప్రవీణ్, అనిల్ యాదవ్, అజరు, శివతేజ, లింగరాజు, శివ ప్రసాద్, మనోజ్, వినరు కుమార్, సాయి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.