Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మొదటి హాస్పిటల్గా ఘనత సాధించిన బెంగుళూరు అపోలో హాస్పిటల్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
అపోలో హాస్పిటల్ బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటైన రోబో అసిస్టెడ్- కార్డియాక్ సర్జరీ యూనిట్ ద్వారా 70 నిమిషాల్లో 100 రోబోటిక్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి, దేశంలోనే మొట్టమొదటి హాస్పిటల్గా ఘనత సాధించింది ఈసందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో డాక్టర్ సాత్విక్ నంబాల, సీనియర్ కన్సల్టెంట్ కార్డియో దారాసిక్, వాస్క్యూలర్ సర్జన్, హెచ్ఓడీ రోబోటెక్ కార్డియాక్ సర్జరీ యూనిట్ మాట్లాడుతూ రోగి జీవితంలోని అత్యంత ఉత్పాదకవంతమైన సంవత్సరాలను, కార్డియా వాస్క్యులర్ వ్యాధులు ప్రభావితం చేస్తాయని, దాని ఫలితంగా విపత్కరమైన సామాజిక, ఆర్థిక పరిణామాలు సంభవిస్తాయని తెలిపారు. అనంతరం అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ రోగుల ప్రయోజనం కోసం భారతదేశానికి అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సంరక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. డాక్టర్ విన్సీ సర్జికల్ సిస్టం అత్యుత్తమ శస్త్రచికిత్స ఫలితాలను అందించడంలో సహాయ పడుతుందని, అంతేకాకుండా అత్యధిక నాణ్యమైన సంరక్షణ అందించటం ద్వారా, వందకు పైగా విజయవంతమైన రోబోటిక్ కార్డియాక్ శస్త్ర చికిత్సలు పూర్తి చేయగలిగామన్నారు. అన్ని అపోలో హాస్పిటల్స్లలో అతి తక్కువ ఖర్చుతో, ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తున్నామన్నారు. బెంగళూర్ అపోలో హాస్పిటల్ లోని రోబోటిక్ కార్డియాక్ యూనిట్, ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ని అందించే అతికొద్ది కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. 2019 చివరిలో ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు.