Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో పునర్ ప్రతిష్టించాలని అఖిల పక్షం నేతలు డిమాండ్ చేశారు. 'అంబేద్కర్ విగ్రహం బంధిఖానాలో ఇంకెన్నాళ్లు' అంటూ సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ నేతలు మల్లురవి, హర్షకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, వినోద్, ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించి పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ను కేసీఆర్ సర్కార్ ముక్కలు చేసి అవమానించిందని ఆరోపించారు. దళిత, బహుజనవాదం పట్ల అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న సర్కార్ దళితుల పట్ల సవతి తల్లి ప్రేమను అవలంభిస్తోందన్నారు. దళితులను ఎన్నికల్లో ఓట్లు వేసే యంత్రాలుగా పరిగణిస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు దళిత బంధు పేరుతో మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునర్ ప్రతిష్టించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామనివీహెచ్ ప్రకటించారు.