Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఫిలింనగర్లోని ఆంజనేయస్వామి గుడిలో విగ్రహాలను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రయివేట్ నిర్మాణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం కలిసి ఆదివారం ఆలయంలోని విగ్రహాలను వేరేచోటికి తరలించడం దుర్మార్గమన్నారు. ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియో పక్కనే ఉన్న పది ఎకరాల భూమిని ఓ ప్రయివేటు సంస్థకు ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిందని ఆరోపించారు. కాగా ర్యాలీగా వెళ్తున్న నాయకులను పోలీసులు మధ్యలోనే అడ్డుకొని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లకు తరలించారు. విషయంతెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు, యువ మోర్చా అధ్యక్షుడు చిట్టబోయిన సందీప్ యాదవ్, బీజేపీ నగర నాయకులు కిలారి మనోహర్, ప్రేమ రాజ్ పోలీస్ స్టేషన్కు వచ్చి గుడిలో విగ్రహం తొలగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.