Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ శ్రీ అభయాంజ నేయ స్వామి ఆలయం వద్ద బాచుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం (తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అను బంధం) అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న దాతలుగా యాదాల నాగ మల్లేశ్వరరావు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.