Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యావరణానికి హానికరం కాని మట్టి గణేష్‌లనే ప్రతిష్టిం చాలని హెచ్ఎండిఏ ఎస్ఈ పరంజ్యోతి అన్నారు. మంగళ వారం హెచ్ఎండిఏ బీపీపీ ఆఫీసులో హెచ్ఎండిఏ, హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచిత పంపిణీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ పరంజ్యోతి మాట్లాడుతూ ఈ ఏడాది 70వేల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ జిందాబాద్ లాంటి స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాల ద్వారా విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కీలక కూడళ్లు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య మాట్లాడుతూ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టిం చాలన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని అందరం మట్టి గణేష్‌లను ప్రతిష్టిద్దాం అని అన్నారు.
మానవ సమాజ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఈఈ శేఖర్, డిప్యూటీ ఈఈ దేవేందర్‌రెడ్డి, హైదరాబాద్ జిందాబాద్ సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, వాస్ తదితరులు పాల్గొన్నారు.