Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
విద్యా పరిరక్షణ, ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భతి తదితర హక్కుల సాధనకోసం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన చలో హైదరాబాద్, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చైతన్య యాదవ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమిస్తే అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ తన ఎన్నికల ముసాయిదాలో స్పష్టం చేసిన నిరుద్యోగుల అంశాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని, ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులను నాంపల్లి పీఎస్కు తరలించిన పోలీసులు తర్వాత విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ పబ్బతి లక్ష్మణ్, హయత్నగర్ మండల అధ్యక్షులు సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, అందోజు అఖిల్, బొంగు అరుణ్, అందోజు వికాస్ రాంబాబు, ప్రశాంత్ పాల్గొన్నారు.