Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధుపథకం వర్తింపచేయాలని పీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మార్వో వినయలతను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఈ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి కేసీఆర్‌కు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని దళిత గిరిజన కుటుంబాలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి వేణుగోపాలచారి, నాయకులు జీడీ శ్రీనివాస్‌గౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్, చాకో, కుట్టి శ్రీనివాస్, వెంకటేష్‌యాదవ్; గుత్తి రామ్‌చందర్, రాములు, బీకే.శ్రీనివాస్, సానాధి శంకర్, పోల్కం వెంకటేష్, వంశీ ముదిరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్ముదిరాజ్, వినోద్‌యాదవ్, నర్సింహాగౌడ్, ఉమేష్‌సింగ్, రహీంభారు, రెబ్బవాసు, సాయి, రోజారమణి, ఆశ తదితరులు పాల్గొన్నారు.