Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మట్టి గణపతులను పంపిణీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ ఆలయ చైర్మెన్ జయరాజ్, ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు