Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
దళితుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాబోయే రోజుల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతలో వంద మందిని ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అహ్మద్ భక్తియార్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బుధవారం రేడియంట్ హైస్కూల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, ముషీరాబాద్ డివిజన్ ఇన్చార్జిలు ముచ్చ కుర్తి ప్రభాకర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఎడ్ల వరుణ్ యాదవ్, కోఆర్డినేటర్లు లక్ష్మణ్ గౌడ్, సదానంద్, అరుణ్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.