Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలనే దృక్పథంతో క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని క్రీడలు, యువజన సంక్షేమం, సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి వి,శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ (టీసీఈఐ) ఈవెంట్ ఆర్గనైజర్ అసోసియేటెడ్ ప్రొఫెషనల్స్, అనుబంధ సంఘం తెలంగాణ ఎంటర్టేనర్స్ అసోసియేషన్ (టీఈఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఆక్టోబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్న టీసీఈఐ టీ బాక్స్ క్రికెట్ పోటీల మొదటి ఎడిషన్ పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలనూ ఏర్పాటు చేస్తామన్నారు. ప్లేయర్లకు క్రీడా కోటా కింద ఉద్యోగాలలో 2%, విద్యారంగంలో 0.5% రిజర్వేషన్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఒలింపిక్స్, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు పెంచుతామని తెలిపారు. 8 జట్లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నమెంట్లో ప్రతి టీమ్ 8 ఓవర్ల చొప్పున ఆడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న ఔత్సాహికులు టోర్నమెంట్లో పాల్గొనడానికి 9966996621 నంబర్లో సంప్రదించవచ్చు అని సూచించారు. కార్యక్రమంలో టీసీఈఐ ప్రెసిడెంట్ రాఖీ కంకారియా, జాయింట్ సెక్రెటరీ తౌఫిక్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ ఆర్జే చేతన్, టీఈఏ జాయింట్ సెక్రెటరీఆర్ జె షైనీ, టెజరర్ ప్రకాష్, జాదూగర్, ఈసీ మెంబర్ సౌరభ్ దాగా, వీజే నగేష్ అమిత్ గుప్తా పవన్ కుమార్ పాల్గొన్నారు.