Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు సీతాఫల్మండీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ఈసందర్భంగా టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి అదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్లో దళితబంధు, గిరిజన, బహుజన బంధును అమలుపర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. నియోజకర్గంలోని అనేక మురికివాడల్లో ఉన్న నిరుపేదలకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జ్యోత్స్నా రెడ్డి, కృష్ణ కుమార్ గౌడ్, సురేష్ లాల్, సందీప్ రాజ్, అనిల్ కుమార్, జయరాజ్, కిషోర్, కరీం, బాబులు, చక్రధర్, రమాలీల, శంకర్, నవాబ్, రమేష్, నజీర్ పాల్గొన్నారు.