Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రొఫెసర్ లింబాద్రికి ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మెన్ పదవి దక్కడం యావత్ దళిత జాతికే గర్వకారణమని ఓయూ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ లాసెట్ 2021 రిజల్ట్స్ సందర్భంగా బుధవారం ఉన్నత విద్య కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లింబాద్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.