Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
బండరావిరాల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 268లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరసింహ కోరారు. భూనిర్వాసితులు చేపడుతున్న ధర్నాకు మద్దతుగా శుక్రవారం రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా నరసింహ మాట్లాడుతూ 17 ఏండ్ల కిందట భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ఇక్కడ మైనింగ్ మాఫియా అక్రమాలకు పాల్పడుతూ ఒకే కంపెనీ మీద లీజుకు తీసుకొని, అక్రమంగా మూడు, నాలుగు కంపెనీలు నడువుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) ఉండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు